Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 1:46 pm Posted by : ramakrishna

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

బాన్సువాడ, బతుకమ్మ  : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పట్టణంలో జెండా ఊపి మంగళవారం ఆయన ప్రారంభించారు. మంత్రికి, ఎమ్మెల్యే కు రవాణా శాఖ అధికారులు హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ , బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.