Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 2:43 pm Posted by : ramakrishna

ఎండల లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన బిక్కనూర్ పోలీసులు

 

బిక్కనూర్, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో  ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను,  ఒక మతోన్మాది చేతిలో దాడికి గురైన హిందూ యువతిని పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గం ఇన్ ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యలో భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.  ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం అరాచకాలు పెట్రేగిపోయాయని, అడుగడుగునా హిందువులను ఇబ్బందులకు గురి చేస్తూ ముస్లింలు అరాచకాలకు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ప్రైవేటు వ్యాపార సంస్థలో పూజ చేసిన అనంతరం దేవుడి పాటలు పెట్టినందుకు హిందూ యువతి మీద దుర్భాషలాడుతూ దాడికి పాల్పడటమే కాకుండా అత్యాచారానికి ప్రయత్నించిన దుండగుడిని వెంటనే అరెస్టు చేసి నిర్భయ కేసును, హత్యాయత్నం కేసును నమోదు చేయాలని, నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో బాన్సువాడ నియోజకవర్గ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు పెళ్లుబిక్కుతాయని  ఆయన పోలీసులను హెచ్చరించారు.

Bikanoor police arrest Endala Lakshminarayana