వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే 145 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (123)ను దాటింది. మరో వైపు మహాగఠ్ బంధన్ కూటమి 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.