Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:46 pm Posted by : ramakrishna

మాజీ సీఎం ఆశీస్సులు తీసుకున్న బిగాల

 

ఎర్రవెల్లి, బతుకమ్మ :

 

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శుక్రవారం గణేష్ బిగాల తన జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు గణేష్ బిగాల‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

Bigala took the blessings of the former CM

 

అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను కూడా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. అలాగే, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సమావేశాలు స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, పలువురు పార్టీ నేతలు మరియు కార్యకర్తలు గణేష్ బిగాల‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

Bigala took the blessings of the former CM