Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 1:06 pm Posted by : ramakrishna

కొండగట్టులో ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

మల్యాల, బతుకమ్మ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభయమ్యాయి. హనుమాన్ దీక్షాపరులతో ఆంజన్న కొండ నిండిపోయింది. వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు యాగశాలలో హోమం చేయనున్నారు. మంగళ ఉదయం మూలవిరాట్ కు అభిషేకం, అర్చన పట్టు వస్త్రాలంకరణ తర్వత మండపంలో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, ధ్వజారోహణం, నవ గ్రహస్థాపన అనంతరం పారాయణం, నైవేద్యం సమర్పించారు.  సాయంత్రం 5 గంటలకు హోమం, మహానైవేద్యం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

అంకురార్పణ పూజలు

సోమవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.  ఈసందర్భంగా యాగశాలను శుద్ధి చేసి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు.