Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 12:16 pm Posted by : ramakrishna

గురుకుల  హాస్టల్ లో బిగ్ ఫైట్

Big fight in Gurukula hostel

ఎల్లారెడ్డి, బతుకమ్మ: సీనియర్లు, జూనియర్ల మధ్య ఇగో పరస్పర దాడులకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ విద్యార్థులు గురువారం రాత్రి బ్యాట్లు, వికెట్లతో దాడి చేసుకున్నారు. ఎంపీసీ, బైపీసీ చదువుతున్న సీనియర్ ఇంటర్  విద్యార్ధులు తమ మాటను జూనియర్ విద్యార్ధులు వినడం లేదని గొడవకు దిగారు. సీనియర్లమైన తమకు రెస్పెక్ట్ ఇవ్వాలని జూనియర్లతో పంచాయితీ పెట్టుకున్నారు. ఇది చివరకు పరస్పర దాడులకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు గ్రూప్ ల విద్యార్ధులు గాయపడగా, స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం గురుకుల పాఠశాలకు జోనల్ అధికారులు, పోలిసులు చేరుకుని విచారించారు.