Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 5:32 pm Posted by : ramakrishna

బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీ

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా “మోడీ కానుక”పేరుతో ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత సైకిల్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల అల్మాస్ పూర్, దుమాల గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు సైకిల్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు, పదో తరగతి విద్యార్థిని,విద్యార్థులు సైకిలను సద్వినియోగం చేసుకొని మంచి ఉత్తీర్ణులై భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అల్మాస్ పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి,దుమాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం గంగయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్,నంది నరేష్, బీజేపీ మహిళ మోర్చా  మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ,జిల్లా కార్యదర్శి మూడవత్ రజిత,లత, లీగల్ సెల్ కన్వీనర్ శరత్ కుమార్,సీనియర్ నాయకులు బందారపు లక్ష్మారెడ్డి, ఉడుగుల యాదగిరి,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్,కదిరి రవి, చెట్టుకూరి సత్తయ్య,రవీందర్ నాయక్,వర్కుటి రాజు, ప్రదీప్ రెడ్డి,గుర్రం సాయికుమార్,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మాలోత్ కిరణ్ నాయక్,మారవేణి రంజిత్ కుమార్, సింగరవేణి కృష్ణహరి,ఉత్తం, సాయికుమార్, మొగులోతు చంద్రయ్య,చందు,శ్రీనివాస్,గంట చరణ్ గౌడ్,నరేష్ పటేల్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Bicycle distribution in government schools under BJP leadership