Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 6:32 pm Posted by : ramakrishna

బిక్నెల్లి జీపీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి : సీఐటీయూ

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : బోధన్ మండలంలోని బిక్నెల్లి గ్రామపంచాయతీలో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికులు బాలాజీ, యాదు మృతికి కారణమైన గ్రామపంచాయతీ కార్యదర్శిని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. మృతి చెందిన బాలాజీ, యాదు కుటుంబాలను ఆదుకుంటామని బోధన్ సబ్ కలెక్టర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండలాధ్యక్షుడు బుడ్డక్కల సాయిలు, యూనియన్ కార్యదర్శి లింగం, కోశాధికారి రాజు, కార్మికులు మారయ్య, సాయవ్వ, గంగమణి, పోశెట్టి, గంగారం తదితరులు పాల్గొన్నారు.