Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:07 pm Posted by : ramakrishna

మాక్లూర్ ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా భూరోల్ల సతీష్

 

. . . మాక్లూర్ ఉప సర్పంచ్ ల ఫోరమ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మాక్లూర్, బతుకమ్మ:

మాక్లూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మండలంలోని ఉప సర్పంచులందరి పూర్తి ఏకాభిప్రాయంతో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా భురోల్ల సతీష్(చిక్లి) ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వగా, ఉపాధ్యక్షుడిగా అరిప్ (మాక్లూర్), ప్రధాన కార్యదర్శి గా సతీష్ (అమ్రాద్), క్యాషియర్ (కోశాధికారి)గా రమేష్ (చిన్నాపూర్), ముఖ్య సలహాదారు గా అరుణ్,చరణ్,సాగర్, హన్మంతు ఎన్నికయ్యారు. అలాగే ఫోరమ్ సలహాదారులుగా . ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి మండలంలోని పలువురు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Bhurolla Satish as President of the Makloor Upasarpanchs' Forum