Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 11:19 am Posted by : ramakrishna

భూపాలపల్లి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

 

. . .  నిన్న ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన  నర్సంపేట్ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్  మృతి

 

. . . ఇప్పటి వరకు నలుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం

 

భూపాలపల్లి, బతుకమ్మ :

 

భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో రవీందర్ ను చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు నలుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.నర్సంపేట్ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం ఆత్మహత్యాయత్నం చేయగా హైదరాబాద్ లోని డీఆర్ డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.