ఏకచక్రేశ్వరాలయ భవన గదుల నిర్మాణ పనులకు భూమిపూజ
బోధన్, బతుకమ్మ: అశేష భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పురాతన చారిత్రిక ఏకచక్రేశ్వర ఆలయం (శ్రీ చక్రేశ్వరాలయం) ఆవరణలో రూ.5లక్షలతో చేపట్టనున్న 20గదుల నిర్మాణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, సెక్రటరీ బీర్కూర్ బుజ్జి, ఆలయ కమిటీ డైరెకర్లు, పట్టణ పెద్దలతో కలసి భూమి పూజ చేశారు. ఆలయం ఆవరణలో దక్షణ దిశలో ఉన్న ఆలయ అభివృద్ధి కమిటీ ఆఫీస్, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆఫీస్ గది, పూజసామగ్రి దుకాణం...