Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 2:08 pm Posted by : ramakrishna

ఏకచక్రేశ్వరాలయ భవన గదుల నిర్మాణ పనులకు భూమిపూజ

బోధన్, బతుకమ్మ:

అశేష భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పురాతన చారిత్రిక ఏకచక్రేశ్వర ఆలయం (శ్రీ చక్రేశ్వరాలయం) ఆవరణలో రూ.5లక్షలతో చేపట్టనున్న 20గదుల నిర్మాణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, సెక్రటరీ బీర్కూర్ బుజ్జి, ఆలయ కమిటీ డైరెకర్లు, పట్టణ పెద్దలతో కలసి భూమి పూజ చేశారు. ఆలయం ఆవరణలో దక్షణ దిశలో ఉన్న ఆలయ అభివృద్ధి కమిటీ ఆఫీస్, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆఫీస్ గది, పూజసామగ్రి దుకాణం గది, భక్తుల విడిది గదులు మొత్తం 20వరకు ఉండగా, వీటి పునాదులు వద్ద మట్టి కొట్టుకుపోయి పిల్లర్లు తేలాయి. ఆలయ భవనాలు పదికాలాల పాటు చెక్కు చెదరకుండా పునాదులు మరింత పటిష్టం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహరిస్తున్న గౌరవ స్థానిక ఎమ్యెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులకు, భక్తులు, దాతలు, పట్టణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లులక్ష్మన్ యాదవ్,కమల భూమేష్, లింగం, పట్టణ పెద్దలు గుండేటి శంకర్, గమర శ్రీనివాస్, ఆలయ పూజారి శివకుమార్ పాల్గొన్నారు.