ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భూమయ్య
కామారెడ్డి, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన రూశేగాం భూమయ్య మాదిగ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుప్రభాత్ హోటల్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా భూమయ్య మాదిగకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. నియామకం అనంతరం రూశేగాం భూమయ్య మాదిగ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్‌లో నిబద్ధతతో పనిచేస్తున్న తనపై...