భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీసీ ద్వారా సమీక్ష నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు...