భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

సబ్ కలెక్టర్ కిరణ్మయి   బతుకమ్మ బాన్సువాడ : భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీవో, డీఎల్​పీవో, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి.. నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చూడాలని చెప్పారు.