Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 3:02 pm Posted by : ramakrishna

భూ భారతి పట్టా అందజేత

మద్నూర్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం  రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తు దారులకు శుక్రవారం సోమూర్ గ్రామానికి చెందిన హనుమంత్ వార్ శివ నంద, ఎబిత్వర్ పూల లబ్ధిదారులకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి చేతుల మీదుగా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో శుక్రవారం భూ భారతి రెవెన్యూ పట్టా హక్కు పత్రాలను అందజేశారు. పట్టా హక్కులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, గిర్దవార్ శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bhu Bharati Patta Award