భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే భూ భారతి
అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : రైతుల భూములపై వారికి పూర్తి హక్కులు భకల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ క్రమంలో ఎవరికైనా భూ సంబంధిత సమస్యలు ఉంటే వాటిని భూభారతి ద్వారా పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, తద్వారా రైతులకు భూములపై పూర్తి భరోసా లభిస్తుందని అన్నారు. భూభారతి (భూమి హక్కుల రికార్డు ) చట్టం-2025 పై బుధవారం చందూర్, మోస్రా మండల...