భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం దోహదం

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు, ఏర్గట్ల మండలం బట్టాపూర్ లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో కలెక్టర్ పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా...