Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:37 pm Posted by : ramakrishna

షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని జీకే తాండలో సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న రేకుల షెడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించడంతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత సుధర్, గ్రామ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ దేవి, వార్డు సభ్యులు బలరాం, ఆకాష్, మోహన్, సునీత తదితరులు పాల్గొన్నారు.