ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో సోమవారం 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు భూమిపూజ చేశారు. ఈ ఇండ్లు గ్రామానికి మంజూరు చేయించేందుకు కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరవడంతో గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, బీసీ సెల్ అధ్యక్షుడు వెల్మల్ రాజేంద్ర, చిరంజీవి గౌతమ్, గుండ్ల పోశెట్టి, గ్రామ అభివృద్ధి...