Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2025, 3:56 pm Posted by : ramakrishna

నగరంలోని  సెయింట్ జేవియర్ స్కూల్ లో భోగి వేడుకల్లో అపశ్రుతి

. . .  భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో ప్రమాధం

. . . విద్యార్ధులకు అంటుకున్న మంటలు

. . . రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్డులోని ఆటవిశాఖ కార్యలయం ఎదురుగా గల సెయింట్ జేవియర్ స్కూల్ లో భోగి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యాశాఖ శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించగా సేయింట్ జేవియర్స్ స్కూల్ లో మాత్రం విద్యార్ధులతో  సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సంధర్బంగా  ఉదయం పాఠశాల అవరణలో బోగి మంటలు వేశారు. అక్కడ మంటల కోసం పెట్రోల్ పోయడంతో మంటలు అంటుకుని చిన్నారి విద్యార్ధినీలకు గాయాలు అయ్యాయి. సీతారాం నగర్ కు చెందిన రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట అందోళనకు దిగారు.

Bhogi celebrations at St. Xavier's School in the city were in disarray

దానితో పాఠశాల యాజమాన్యం స్కూల్  విద్యార్ధులను పంపించి వేసి లోపల నుంచి తాళాలు వేసుకున్నారు. ఎలాంటి ప్రమాధం జరుగలేదని అనడం, ఎవ్వరికి గాయాలు కాలేదని చెప్పడం దారుణం. ఈ విషయంపై విద్యార్ధి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వారినే విడియోలు తీయడం సేయింట్ జేవియర్స్ హై స్కూల్ యాజమాన్యంకు చెల్లింది. ప్రమాదం జరిగిన వేంటనే ఆగ్నీమాపక శాఖకు గాని, స్థానిక విద్యాశాఖాధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం గమనర్హం. విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం కారణంగా సెలవులలో వేడుకలు నిర్వహిస్తు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్ధు చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Bhogi celebrations at St. Xavier's School in the city were in disarray