- కూరగాయలు, పండ్ల మార్కెట్ ను తరలించాలని బైఠయించి బీజేపీ శ్రేణులు
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ బస్టాండ్ కు సమీపంలో గల కూరగాయల, పండ్ల మార్కెట్ ను వెంటనే పాత తహసీల్దార్ కార్యాలయం గ్రౌండ్ వద్దకు తరలించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంను ముట్టడించి బీజెపీ పట్టణ శ్రేణులు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా భారత్ మాతకీ జై, వీక్లీ మార్కెట్ ను, పండ్ల మార్కెట్ ను తరలించాలని నినాదలు చేశారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడం తో సంబంధిత అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారితో మాట్లాడుతూ వారం లోగా మార్కెట్ ను తరలించకుంటే బారీ ఎత్తున మళ్ళీ ఆందోళన చెప్పడతామని హెచ్చరించారు. ఈ రోజు కమిషనర్ లేకపోతే రేపో, యెల్లోండో వచ్చి సమస్యను కండ్ల నిండా చూపిస్తామని తెలిపారు. ఈ ఇరుకు మార్కెట్ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కనికరం మధు, స్టేట్ కౌన్సిల్ మెంబెర్ యోగేశ్వర నర్సయ్య, జిల్లా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండారి లక్ష్మణ్ గౌడ్, సంధ్యా రాజు తదితరులు పాల్గొన్నారు.