Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2024, 6:33 pm Posted by : ramakrishna

భీమన్న ఉత్సవాన్ని విజయవంతం చేయాలి

నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్ 
నిజామాబాద్, బతుకమ్మ : పోచంపాడు లో జరిగే భీమన్న ఉత్సవానికి నాయక పోడ్ సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్ పిలుపునిచ్చారు. డిచ్ పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ కుల సంఘం సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  మన ఆరాధ్య దైవం అయిన బీమన్న ఉత్సవాలను మన జిల్లాలో వైభవంగా జరుపుకోవాలని అలాగే నవంబర్15న కార్తీక పౌర్ణమి రోజు జరిగే
శ్రీ శ్రీ భీమన్న ఉత్సవానికి  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కొరకు మన గ్రామాలలోకి వచ్చినప్పుడు కులానికి సంబంధించి కాలం లో నాయకపోడు ఎస్టీ అని రాయించాలని వారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ప్రకటించింది కావున నిరుపేదలందరూ కూడా అప్లై చేసుకోవాలని సూచించారు. పై చదువుల కొరకు విదేశాలకు వెళ్లాలి అనుకొనే విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని వినియోగించుకోవాలని నాయకపోడు విద్యార్థులకు ఆయన తెలిపారు. గ్రామాలలో నాయకపోడు కులస్థుల పైన దాడులు చేసిన, కించపరిచే విధంగా మాట్లాడిన, చట్టపరంగా చర్యలు తీసుకోవడనికి ఎల్లవేళలా మీ వెంట జిల్లా కమిటీ ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్ పోడ్ జిల్లా ఉపాధ్యక్షులు దాత్రిక అంజయ్య , వాసరి సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు భూమయ్య ,ఎర్రోళ్ల శీను , సాయిలు ,పోషన్న, ఆదివాసి నాయక్ పోడ్ కుల పెద్దలు పాల్గొన్నారు.