Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 5:35 pm Posted by : ramakrishna

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు భిక్కనూరు విద్యార్థి ఎంపిక

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు  మండలంలోని సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన అకుల్ జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడలకు ఎంపికయ్యాడు. ఆదివారం కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిల్లో అండర్-12 విభాగంలో పాల్గొని మంచి ప్రతిభ చూపి జాతీయ స్థాయి కి ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. గత 2సంవత్సరాలుగా అకుల్ దోమకొండ గడికోటలో కోచ్ ప్రతాప్ దాస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయస్థాయి కి అకుల్ ఎంపిక కావడంపట్ల భిక్కనూరు శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది, భిక్కనూరు అధికారులు, పలువురు అభినందించారు.

Bhikkanur student selection for national level archery competitions