భిక్కనూరు ఎస్సైగా డి.ఆంజనేయులు
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు ఎస్ఐగా పని చేస్తూ గతనెలలో ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ స్థానంలో డి.ఆంజనేయులును నియమిస్తూ కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భిక్కనూర్ ఎస్సైగా డి.ఆంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆంజనేయులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లేని భిక్కనూర్ చేయాలనేది తన ధ్యేయం అని అన్నారు. శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.