Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 1:48 pm Posted by : ramakrishna

బహిరంగ సభకు బయలుదేరిన భీంగల్ కాంగ్రెస్ శ్రేణులు

భీమ్ గల్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహిస్తున్న బూతు స్థాయి కార్యకర్తల బహిరంగ సభకు భీమ్‌గల్ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం బయలుదేరివెళ్లారు. ఈ కార్యక్రమం లో భాగంగా మండలంలోని అని గ్రామల బూతు స్థాయి కార్యకర్తలు, నాయకులు భారీగా బయలుదేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరె స్వామి ఆధ్వర్యంలోమండల కేంద్రం నుండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదలు చేశారు.ఈ సందర్భంగ బొదిరె స్వామి మాట్లాడుతూ జై బాపు,జై భీం,జై సంవిదాన్ కార్యకమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల బూతు స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.సభకు బయలుదేరి వెళ్లినవారిలో మాజీ ఎంపిపి కన్నె సురేందర్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ పర్స అనంత్ రావు, ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ బాధవత్ గోపాల్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ జె జె నర్సయ్య, డీ సీ సీ డెలికాట్ కుంట రమేష్, బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ కోరాడి రాజు, యూత్ కాంగ్రెస్ కానిస్టెన్సీ నాయకులు నాగేంద్రబాబు,రావుల మోహన్, అరిగెల జనార్దన్ తదితరులు ఉన్నారు.