భీంగల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల నూతన అధ్యక్షులు గా నియమితులైన శెట్టి ప్రేంచంద్ శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. భీమ్ గల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ ఆరే రవీందర్ ఆధ్వర్యంలో కలిశారు.ఈ సందర్బంగా ఎం. పీ మాట్లాడుతూ భీమ్ గల్ మండలంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్తున్నారని అభినందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మండలంలో ఇంకా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ఎంపీ సూచించరని రవీందర్ తెలిపారు.ఎం. పీ ని కలిసిన వారిలో మండల ఉపాధ్యక్షులు ఓరగంటి కిషన్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, మండల నాయకులు ఉన్నారు.