భవతీ.. క్షీరాందేహీ
రోజురోజుకి తగ్గుముఖం రైతుల కలిసేందుకు బిడియం చైర్మెన్ రాకలో ఆరు వేలు, ప్రస్తుతం నాలుగు వేల లీటర్ల పాలు విజయ డెయిరీ మనుగడపై సందేహాలు నిజామాబాద్, బతుకమ్మ: రైతుల నుంచి సేకరించే పాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకు తగ్గాయో అంచనా వేసుకొని, పెరిగేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తున్నారు. డెయిరీని అభివృద్దిలోకి తేవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతి సమావేశాలలో వల్లె వేస్తూ వస్తున్నారు. ఆయన ఎదుట హాజరవుతున్న అధికారులు, సంస్థ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని చెప్తూ, హమ్మయ్య...