భట్టి బడ్జెట్ బోగస్
ఇది రేవంత్ తుగ్లక్ పాలనకు నిదర్శనం ఆరు గ్యారెంటీలకు పాతరేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పెద్ద బోగస్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించేలా ఉన్న దిశానిర్దేశం లేని ఈ దిక్కుమాలిన బడ్జెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పిచ్చి తుగ్లక్ పాలనకు నిలువెత్తు నిదర్శనమని ఆయన ఒక ప్రకటనలో...