పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా భాస్కర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీయల్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి శంకర్ రాజు, ఉపాధ్యక్షులుగా సుజాతాదేవి, నవీన్ కుమార్, సతీశ్, అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా ఎం ప్రదీప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పద్మ, విజయ్, రాకేశ్, శంకర్, కోశాధికారిగా ఎన్ విఠల్, రాష్ర్ట కౌన్సిల్ సభ్యులుగా భీమ్ రావు, లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులుగా భాగయ్య, గంగాధర్, సిద్ధూపటేల్ ఎన్నికయ్యారు.