Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 6:15 pm Posted by : ramakrishna

మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. బాధిత మహిళలకు, మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు, మహిళలకు భరోసా కేంద్రంతరపున చెక్కులను అందజేశారు. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనో-ధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటని తెలిపారు. బాధిత మహిళలకు, పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి మనదైన తోడ్పాటు అందించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. ప్రతీ మహిళలు,  పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధి-తుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావతి, మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.