Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 5:59 pm Posted by : ramakrishna

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలో బిజేపి అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన సభ్యత నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు 8800002024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి, బిజెపి కార్యకర్త అందించే సభ్యత నమోదు ఫారం లో వివరాలు నింపి బీజేపీ సభ్యులుగా చేరారని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సభ్యత్వం పొందవచ్చని, నమో ఆప్ ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫీచర్ ఫోన్ మాత్రమే ఉన్నట్లయితే ఇతర స్మార్ట్ఫోన్ నుంచి మిస్ కాల్ ఇచ్చి తర్వాత వచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగా వచ్చిన ఫామ్ లో మీ వివరాలు నింపి బీజేపీ సభ్యులు కావచ్చుని తెలియజేశారు. ఒకవేళ మీ ప్రాంతంలో స్మార్ట్ఫోన్ నెట్వర్క్ లేకుంటే బీజేపీ కార్యకర్త అందించే సభ్యత్వ నమోదు ఫారంలో వివరాలు నింపి బీజేపీ సభ్యులు చేరవచ్చు అని వారన్నారు. కార్యక్రమంలో ప్రముక్ జెడి గంగారెడ్డి, ఒడ్డెం ప్రశాంత్, బోగ దేవేందర్, లింగాల రాము గౌడ్, మురళి గౌడ్, బొడిగ మోహన్, శ్రీనివాస్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.