Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 3:13 pm Posted by : ramakrishna

శెట్ పల్లి వాసికి భారత్ సేవా పురస్కార్ అవార్డు ప్రదానం

బతుకమ్మ,నిజామాబాద్:అనాధలకు అండగా పేదవారికి తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను కరుణ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు భారత్ సేవ పురస్కార్ అవార్డు దక్కింది. మంగళవారం హ్యూమన్  రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ పరిషత్ కళాభవన్ లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలలో భాగంగా మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామానికి చెందిన కరుణ ట్రస్ట్  సేవా సంస్థ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. తన సేవలను గుర్తించి భారత్ సేవ పురస్కార్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం

Bharat Seva Puraskar Award given to Shet Pally resident

చేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ కొప్పుల విజయ్ కుమార్, రాష్ట్ర ఛైర్మెన్ నర్సింగ్ , ప్రొఫెసర్ రాములు, హై కోర్టు న్యాయవాది కడారి రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్,సౌత్ ఇండియా ఛైర్మెన్ హన్మాగౌడ్, విజయ్ పటేల్, నిజామాబాద్ జిల్లా వీఆర్వో లింగం తదితరులు పాల్గొన్నారు.

Bharat Seva Puraskar Award given to Shet Pally resident