Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 3:07 pm Posted by : ramakrishna

దివ్యాంగులకు భారత్ రైల్వే గుడ్ న్యూస్

హైదరాబాద్ , బతుకమ్మ :  దివ్యాంగులకు భారత్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ పాస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా  https://divyangjanid.indianrail.gov.in/   వెబ్ సైట్ ను ప్రారంభించారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతోపాటు ఛార్జిలోనూ రాయితీ ఉంటుంది.  వెబ్ సైట్లోకి వెళ్లి పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా లాగిన్ చేసి వివరాలు నమోదు చేయాలి. అనంతరం యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డును మంజూరు చేస్తారు.