నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం ఎన్నికల్లో భక్తవత్సలం(ఢిల్లీ) ప్యానెట్ ఘన విజయం సాధించింది. భక్తవత్సలం, బాస రాజేశ్వర్ ప్యానెల్ లు పోటీపడగా, చివరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. 12 మంది కార్యవర్గ సభ్యులతోపాటు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శుల పదువులను ఢిల్లీ ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్ కొనసాగింది.