Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 11:35 am Posted by : ramakrishna

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

 

బీర్కూర్, బతుకమ్మ :

 

బీర్కూర్ మండల కేంద్రంలో గల భగత్ సింగ్ చౌరస్తాలో భగత్ సింగ్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, పీడీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ లు మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ చిన్న వయస్సు నుండే ఈ భారతదేశనికి స్వాతంత్రం కావాలని కోరుకున్నాడని, అందులో భాగంగానే బ్రిటిష్ వల్లని తరిమికొట్టడంలో ముందుండి పోరాడిన వీరుడన్నారు. తాను 7 ఏళ్ల వయస్సు నుండి 23 ఏళ్ల వరకు అనేక పోరాటాలు జరిపాడని, ఆయన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఇలాంటి వీరులను దేశ యువత ఆదర్శంగా తీసుకొని దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ముందుండి పోరాడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలపై, జెంజి తరహా ఉద్యమాలను నిర్వహించి ప్రభుత్వల మెడలు వంచేలా ఉండాలని యువతకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత కోర్రి శివకుమార్, వడ్ల చంద్రకాంత్, బాలకృష్ణ, వడ్ల బసవరాజు, చామకురా రాజు, నారం శేఖర్, అరిగే నరేష్, షేక్ సమీర్, కుర్రి కృష్ణ, మహేష్  పాల్గొన్నారు.