వెబ్ న్యూస్,బతుకమ్మ : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. ఈ ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈవోకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు. ప్రసాదాల తయారీ, ఆహార భద్రత, నిర్వహణ స్థాయి పాటించడంతో ఈగుర్తింపు లభించింది. రాష్ట్రంలో యాదగిరి గుట్ట దేవస్థానం తర్వాత భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఈఅరుదైన ఘనత దక్కింది.
