ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడేలా మెరుగైన శిక్షణ అందించాలి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై, ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్ షాప్ లను సందర్శించి, పనితీరును పరిశీలించారు. విద్యార్థిని, విద్యార్థులతో భేటీ అయ్యి,...