ఉత్తమ ఫలితాలకు మెరుగైన విద్యా బోధన
పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్ధి కళాశాలల్లో చేరేలా చూడాలి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ బడులు, కాలేజీలు, గురుకులాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యా శాఖ పనితీరుపై అధికారులతో...