Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 4:04 pm Posted by : ramakrishna

మెరుగైన వైద్య సేవలు అందించాలి

  • జక్రాన్ పల్లి పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
  •  సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్, సుద్దులం జెడ్పీ హైస్కూల్ సందర్శన

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు.

Better medical services should be provided

పీ హెచ్ సిలోని ఇన్ పేషంట్ వార్డ్, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలను నిలువ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి, అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పీ హెచ్ సి కి వచ్చిన రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను పరిశీలించి, సీబీపీ మెషిన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటి స్థానంలో కొత్త స్టాక్ ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు.

Better medical services should be provided

  •  ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అనంతరం కలెక్టర్ డిచ్పల్లి మండలం సుద్దపల్లి లోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జెడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. సుద్ధపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కూరగాయలు సక్రమంగా భద్రపర్చకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

Better medical services should be provided

ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. సుద్దులం జెడ్పీ హైస్కూల్ లో తాగునీటి వసతి, కిచెన్ షెడ్ టాయిలెట్స్, క్రీడా మైదానం తదితర వాటిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందాయా? అని అడిగి తెలుసుకున్నారు. పాటశాల ఆవరణలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థినీ విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. గతేడాది టెన్త్ లో వచ్చిన ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Better medical services should be provided