రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
వైద్యులు సమయపాలన పాటించాలి పోతంగల్ పీ.హెచ్.సీ తనిఖీ చేసిన కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యసిబ్బందిని ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. బుధవారం పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అంతకుముందు కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్...