Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 7:50 pm Posted by : ramakrishna

విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

 

. . . విద్యార్థులను పరామర్శించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని సూచించా రు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.