మత్స్య కార్మికులకు మరింత మెరుగైన ఉపాధి
ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025 - 2026 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్...