Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 6:24 pm Posted by : ramakrishna

మెరుగైన విద్యను అందించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. మంగళవారం నగరంలోని శంకర్ భవన్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్య బోధనలను పరిశీలించారు. రిజిస్టర్ను పరిశీలించి ఉపాధ్యాయుల హాజరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు తీసుకువచ్చేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలి అన్నారు. అనంతరం డిఈఓ ను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన టీచర్లు వెనిగళ్ళ సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Better education should be provided