ఎస్ఐ నర్సయ్యకు ఉత్తమ ప్రతిభా పురస్కారం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్య ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునిత కుంచాల నుంచి ఉత్తమ ప్రతిభా పురస్కారం సొమవారం అందుకున్నారు. ఎస్ఐ నర్సయ్య కోర్టు లిగల్ ఎయిడ్ కేసుల పరిష్కరంలో చూపిన చోరవకు గాను ఉత్తమ ప్రతిభా పురస్కారంను దక్కించుకున్నారు. ఈ సంధర్బంగా ఎస్ఐ నర్సయ్యను ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.