బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్కీమ్ ప్రవేశాల ఎంపిక పూర్తి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   2026-2027 విద్యా సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్కీమ్ కింద 3వ, 5వ, 8వ తరగతుల ఇంగ్లిష్ మీడియం ప్రవేశాల ఎంపిక ప్రక్రియను నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ మంగళవారం నిర్వహించింది. జిల్లా సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా విద్యాశాఖాధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ విధానంలో ఎంపిక చేపట్టారు. ఈ...