లబ్ధిదారుల సమాచారాన్ని పక్కగా సేకరించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే లో లబ్ధిదారుల సమాచారాన్ని పక్కగా సేకరించి యాప్ లో పొందూపరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల సర్వే లో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేయాలని, అవసరమైన భూమి పత్రాలు, ఆహార...