లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. అర్హత గల వారిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులకు...