నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని, నిర్ణీత గడువు లోపు లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కార్యోన్ముఖులను చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ శనివారం...