Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 3:45 pm Posted by : ramakrishna

లబ్ధిదారులను ప్రోత్సహించాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో  ఇందిరమ్మ ఇండ్లు  లబ్దిదారులకు, ఇంటి నిర్మాణానికి  ముగ్గు వేసి మంజూరి పత్రాలు అంధ చేసినారు. త్వరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు అదేవిధంగా  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఇండ్ల నిర్మాణం పత్రాన్ని కలెక్టర్ లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడి.విజయపాల్ రెడ్డి, ఎంపీడీఓ, తాసిల్దార్, స్పెషల్ ఆఫీసర్ దీహౌసింగ్, ఏఈహౌసింగ్  ప్రజలు పాల్గొన్నారు.